![]() |
![]() |
బిగ్ బాస్ సీజన్-9 లో కామనర్స్ స్పెషల్. ఎందుకంటే వాళ్ళు అగ్నిపరీక్షలో గెలిచి ఇందులోకి వచ్చారు. కామనర్స్ లో మాస్క్ వేసుకొని వచ్చి హరీష్ అందరిని ఆశ్చర్యపరిచాడు. మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్. తనకంటూ విభిన్న మనస్తత్వంతో జడ్జెస్ ని ఆకట్టుకొని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో అందరు ఒకటి అంటే తనొకటి అంటాడు. బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలు అత్యధిక నామినేషన్లు పడ్డ కంటెస్టెంట్ హరిత హరీష్.
కొన్ని రోజులుగా హౌస్ లో భోజనం చెయ్యడం లేదు.. నేను వెళ్ళిపోతాను.. ఇప్పుడున్న సిచువేషన్ లో నన్ను నా ఫ్యామిలీనీ సొసైటీ ఎలా చూస్తుందోనని ఓవర్ థింకింగ్ చేస్తూ నేను వెళ్ళిపోతానని అంటున్నాడని నాగార్జున చెప్పుకొచ్చాడు కానీ దానికి సంబంధించినది మాత్రం ఎపిసోడ్ లో టెలికాస్ట్ చెయ్యలేదు. అయితే వీకెండ్ ఎపిసోడ్ లో మాస్క్ మ్యాన్ హరీష్ భార్య హరితతో నాగార్జున మాట్లాడాడు. మీరు మీ ఫ్యామిలీ బాగున్నారా.. ఎందుకు హరీష్ అలా ఫీల్ అవుతున్నాడని హరితని నాగార్జున అడిగాడు. అంటే నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చాడు కదా అలా ఆలోచిస్తున్నాడని హరిత చెప్తుంది. మీరు ఏం హరీష్ గురించి టెన్షన్ పడకండి తను బాగున్నాడు అన్నం తింటున్నాడని నాగార్జున చెప్తాడు. తనలో ఉన్న హ్యూమర్ ఇంకా బయటకు రాలేదు. తనకి నేను చెప్పినట్టుగా చెప్పండి అసలు హౌస్ లోకి ఏ పర్పస్ పై వెళ్ళావ్.. ఎందుకు వెళ్ళావ్.. వాట్ నెక్స్ట్ .. ఈ ముడు గుర్తు పెట్టుకొమ్మని చెప్పండి అని నాగార్జునతో హరిత చెప్తుంది. తన మాటలకి నాగార్జున ఇంప్రెస్ అవుతాడు.
ఆ తర్వాత ఎపిసోడ్ మధ్యలో హరీష్ తో నాగార్జున మాట్లాడతాడు. ఇప్పుడే మీ వైఫ్ హరితతో మాట్లాడాను.. వాళ్ళు బాగున్నారు.. నీకు ముడు విషయాలు హరిత చెప్పిందని నాగార్జున చెప్పగానే హరిష్ ఎమోషనల్ అవుతాడు.. కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తాడు. తన భార్య చెప్పిన మాటలని హరీష్ అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి ఎప్పుడు వెళ్తావ్ హౌస్ నుండి అని నాగార్జున అడుగగా లేదని, వెళ్ళనని హరిష్ అంటాడు.
![]() |
![]() |